Mulugu: ములుగు జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జవాన్ల మధ్య కాల్పులు.. ఒకరి మృతి

shooting between crpf jawans one dead in mulugu dist
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలోని ములుగు జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జవాన్ల మధ్య జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని వెంకటాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఆర్‌పీఎఫ్ 39వ బెటాలియన్‌ జవాన్ల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ కాల్పులకు దారితీసినట్టు తెలుస్తోంది.

గాయపడిన మరో జవానును ములుగు ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Mulugu
Telangana
CRPF
Firing

More Telugu News