ఏపీలో మళ్లీ 100కి దిగువన కరోనా కొత్త కేసులు... పూర్తి వివరాలు ఇవిగో!

  • గత 24 గంటల్లో 29,801 కరోనా పరీక్షలు
  • 94 మందికి కరోనా పాజిటివ్
  • చిత్తూరు జిల్లాలో 15 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 1,279 మందికి చికిత్స
ఏపీలో మరోమారు 100కి దిగువన కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 29,801 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 94 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో 15, గుంటూరు జిల్లాలో 12, పశ్చిమ గోదావరి జిల్లాలో 11 కొత్త కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో 139 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,76,306 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,60,539 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,279 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,488కి పెరిగింది.


More Telugu News

Andhra Pradesh Corona Virus Daily Report Today Cases