గోపీచంద్ 30వ చిత్రం ప్రారంభం... శ్రీవాస్ తో మూడో చిత్రం
- లక్ష్యం, లౌక్యం తర్వాత శ్రీవాస్ తో గోపీచంద్ సినిమా
- కెమెరా స్విచాన్ చేసిన టీజీ వెంకటేశ్
- ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టిన వీవీ వినాయక్
- వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్
కాగా, నేడు హైదరాబాదులో పూజా కార్యక్రమాలు నిర్వహించగా, బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ కెమెరా స్విచాన్ చేశారు. హీరో గోపీచంద్ పై తొలి షాట్ కు ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ కొట్టారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో ఓ కీలకపాత్రకు రాజశేఖర్ ను తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.
