ఇటువంటి ఏ హీరోకీ సినిమా టికెట్ ధర గురించి మాట్లాడే అర్హత లేదు: అంబటి
- ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల ధరలపై వివాదం
- ఏపీ సర్కారుపై సినీ హీరో నాని సంచలన వ్యాఖ్యలు
- హీరోలు పారితోషకాన్ని వెల్లడించాలంటూ అంబటి డిమాండ్
మరోపక్క, హీరో నానిపై వైసీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. హీరో నాని సినిమాలకు తీసుకుంటోన్న పారితోషికం ఎంత? అంటూ నిలదీస్తున్నారు. వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా ఈ విషయంపై స్పందిస్తూ నానిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. 'పారితోషకాన్ని వెల్లడించకుండా సినిమా టికెట్ ధర గురించి మాట్లాడే నైతిక అర్హత ఏ హీరోకీ లేదు!' అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. మరోవైపు, నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమా ఈ రోజే విడుదలైంది.