రేపు కాకినాడలో 'పుష్ప' సక్సెస్ పార్టీ!
- ప్రాంతాలవారీగా సక్సెస్ పార్టీ నిర్వహణ
- తిరుపతిలో జరిగిన తొలి సక్సెస్ పార్టీ
- నిన్న చెన్నైలో సందడి చేసిన 'పుష్ప' టీమ్
- హిందీలోను తగ్గని జోరు
తొలి సక్సెస్ మీట్ ను మొన్న తిరుపతిలో నిర్వహించారు. నిన్న ఈ సినిమా సక్సెస్ పార్టీని చెన్నైలో జరిపారు. ఇక రేపు సక్సెస్ పార్టీని కాకినాడలో నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. సక్సెస్ పార్టీలు ఈ సినిమాకి మరింత హైప్ తీసుకొచ్చాయనే అంటున్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీలోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతున్నట్టుగా చెబుతున్నారు. అనువాద చిత్రాల ద్వారా ఉత్తరాదివారికి అల్లు అర్జున్ బాగానే తెలుసు. ఆయన సినిమాలను అక్కడి వారు బాగానే ఇష్టపడుతూ ఉంటారు. ఈ సినిమా అక్కడ ఆ స్థాయిలో దూసుకుపోవడానికి అదే కారణమని చెప్పుకుంటున్నారు.
.