Julia: భారత్ లో పెళ్లి చేసుకున్న రష్యా అమ్మాయి, జర్మనీ అబ్బాయి

భారత్ కు చెందిన యువతీయువకులు విదేశీయులను పెళ్లాడడం తెలిసిందే. అయితే, విదేశాలకు చెందిన అమ్మాయి, అబ్బాయి భారత్ లో పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యం కలిగించకమానదు. రష్యా అమ్మాయి జూలియా, జర్మనీకి చెందిన క్రిస్ ముల్లర్ భారత్ వచ్చి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడం విశేషం. ముల్లర్ కు ఓ ప్రవాస భారతీయుడు మిత్రుడు కాగా, అతడి సహకారంతోనే ఈ హిందూ వివాహం జరిగింది.

ఈ నెల 21న జూలియా, ముల్లర్ ఒక్కటయ్యారు. వారిద్దరికీ భారత్ తో ఎలాంటి సంబంధం లేకపోయినా, భారతీయ సనాతన ఆచారాలు, హైందవ సంప్రదాయాల పట్ల మక్కువతో వారు ఇక్కడికి వచ్చారు. గుజరాత్ లోని సకరోడియా గ్రామంలో వీరి పెళ్లి శాస్త్రోక్తంగా జరిగింది. ఎలాంటి బంధుత్వం లేకపోయినా భారతీయులు చూపించిన ప్రేమాభిమానాలతో జూలియా, ముల్లర్ ముగ్ధులయ్యారు.
Julia
Muller
Russia
Germany
Hindu Marriage
India

More Telugu News