కేసీఆర్ పై ఇక యుద్ధమే... తెలంగాణ బీజేపీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం
- అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే బీజేపీ సమాయత్తం
- కేసీఆర్ అవినీతిని బయటపెట్టాలన్న అమిత్ షా
- బియ్యం కుంభకోణాన్ని బట్టబయలు చేయాలని సూచన
- ఇకపై తెలంగాణలో తరచుగా పర్యటిస్తానని వెల్లడి
హుజూరాబాద్ తరహాలోనే రాబోయే ఎన్నికల్లోనూ బీజేపీ విజయభేరి మోగించాలని అమిత్ షా స్పష్టం చేశారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా మీరు చేయాల్సింది మీరు చేయండి... ప్రభుత్వ పరంగా ఏంచేయాలో మాకు వదిలేయండి అని ఉద్బోధించారు. ఇకపై తెలంగాణలో తరచుగా పర్యటిస్తానని పార్టీ వర్గాలకు హామీ ఇచ్చారు.