Jagan: జగన్ కి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు    

Chiranjeevi and Mahesh Babu greets Jagan
  • ఈ రోజు ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు
  • ట్విట్టర్ ద్వారా వెల్లువెత్తిన శుభాకాంక్షలు
  • పలు కార్యక్రమాలను నిర్వహించిన వైసీపీ శ్రేణులు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు గ్రీటింగ్స్ తెలియజేశారు. 'ఏపీ సీఎం జగన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు' అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ 'హ్యాపీ బర్త్ డే జగన్మోహన్ రెడ్డిగారు. భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలి' అని ట్వీట్ చేశారు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందిస్తూ 'గౌరవనీయ ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో ఏపీ పురోగమించాలి, పరిఢవిల్లాలి. అన్నివేళలా సంతోషం, ఆరోగ్యం మీకు ఉండాలని ఆకాంక్షిస్తున్నా' అని ట్వీట్ చేశారు.

మరోవైపు జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు పలు కార్యక్రమాలను చేపట్టారు. రక్తదాన, అన్నదాన శిబిరాలను నిర్వహించారు. మొక్కలను నాటారు. కేకులు కట్ చేసి వేడుక జరుపుకున్నారు.
Jagan
YSRCP
Chiranjeevi
Mahesh Babu
Tollywood

More Telugu News