Nara Lokesh: దళితుడైన వెంకటనారాయణపై పెట్రోల్ పోసి నిప్పంటించిన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా: నారా లోకేశ్

Nara Lokesh fires on YCP cadre again
  • గుంటూరు జిల్లాలో ఘటన
  • పెదనందిపాడులో సీఎం జగన్ జన్మదిన వేడుకలు
  • చంద్రబాబును దూషించారంటూ ఓ వ్యక్తి అభ్యంతరం
  • మద్యం సీసాలతో కొట్టారంటూ లోకేశ్ వెల్లడి

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైసీపీ శ్రేణులపై మరోమారు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల్లో చంద్రబాబును దూషిస్తున్న వైసీపీ శ్రేణులను వెంకటనారాయణ అనే దళితుడు ప్రశ్నించాడని లోకేశ్ తెలిపారు. అయితే, ప్రశ్నించడమే నేరంగా వెంకటనారాయణను వైసీపీ కార్యకర్తలు మద్యం సీసాలతో కొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించారని ఆరోపించారు. ఈ రాక్షస మూకల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

"తప్పుని తప్పు అని చెబితే చంపేస్తారా? మంచి చెప్పే మనుషుల ప్రాణాలే తీసేస్తారా?" అంటూ లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఒంగోలులో వైశ్యుడైన వైసీపీ నేత సుబ్బారావు గుప్తా, నేడు వెంకటనారాయణ... ఇలా రోజుకొకరు వైసీపీ పిశాచ ముఠాలకు బలి కావాల్సిందేనా? అని ప్రశ్నించారు. ప్రభుత్వమే ఇవన్నీ చేయిస్తోందనేది స్పష్టంగా తెలుస్తోందని, అయితే ఆదుకోవాల్సిన పోలీసులు ఏమయ్యారు? అంటూ ఆయన నిలదీశారు.

  • Loading...

More Telugu News