"హ్యాపీ బర్త్ డే జగన్"... ఏపీ సీఎంకు సింపుల్ గా విషెస్ తెలిపిన చంద్రబాబు

ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన 49వ ఏట అడుగుపెడుతున్నారు. పార్టీలు, వర్గాలకు అతీతంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, విపక్ష నేత చంద్రబాబు కూడా సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఎంతో సాధారణ రీతిలో ఏక వాక్యంతో "హ్యాపీ బర్త్ డే జగన్" అంటూ విషెస్ తెలియజేశారు. అంతకుమించి ఆయన స్పందించలేదు. చంద్రబాబు ట్వీట్ కు విశేష స్పందన వస్తోంది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే వేల లైకులు, కామెంట్లు వచ్చాయి.


More Telugu News