Karthi: శింబు జోడీగా దర్శకుడు శంకర్ తనయ!

Adithi Shankar in Simbu Movie
  • మెడిసిన్ పూర్తి చేసిన శంకర్ కూతురు
  • సినిమాల పట్ల ఆసక్తితో ప్రయత్నాలు
  • కార్తి జోడీగా కోలీవుడ్ కి పరిచయం
  • లైన్లో శింబు 'కరోనా కుమార్'  
తమిళ దర్శకుడు శంకర్ కూతురు అదితి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మెడిసిన్ పూర్తి చేసిన ఈ అమ్మాయి, కార్తి కథానాయకుడిగా చేస్తున్న 'విరుమాన్' సినిమాతో తమిళ తెరకి పరిచయమవుతోంది. ఈ సినిమాకి నిర్మాత సూర్య కావడం విశేషం. ఒక కీలకమైన పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించనున్నాడు.

ఈ సినిమా సెట్స్ పై ఉండగానే అదితి మరో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 'కరోనా కుమార్' అనే టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమాలో ఆమె శింబు జోడీగా సందడి చేయనుంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి గోకుల్ దర్శకత్వం వహించనున్నాడు.
 
ప్రస్తుతం శింబు .. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగు పూర్తి కాగానే 'కరోనా కుమార్' సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా చెబుతున్నారు. అదితి మాత్రం వరుస సినిమాలను ఒప్పేసుకుంటూ వెళ్లాలనే పట్టుదలతో ఉందని అంటున్నారు. మరి శంకర్ కూతురు టాలీవుడ్ కి కూడా తన టాలెంట్ చూపిస్తుందేమో చూడాలి.

More Telugu News

Karthi
Simbu
Adithi
Corona Kumar Movie