అవి ప్రమాదంలో తగిలిన గాయాలు కాదు: మంచు లక్ష్మి

Manchu Lakshmi clarifies latest Instagram pics
  • ఇన్ స్టాగ్రామ్ లో మంచు లక్ష్మి ఫొటోలు
  • చేతికి, కాలికి గాయంతో మంచు లక్ష్మి
  • అభిమానుల్లో ఆందోళన
  • వివరణ ఇచ్చిన మంచు లక్ష్మి
టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మి ప్రస్తుతం మోహన్ లాల్ నటిస్తున్న ఓ  మలయాళ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆమె తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన కొన్ని ఫొటోలు అభిమానులను ఆందోళనకు గురిచేశాయి. మంచు లక్ష్మి చేతికి, కాలికి గాయాలు తగిలి ఉండడం ఆ ఫొటోల్లో కనిపించింది. దాంతో ఆమె ప్రమాదానికి గురై ఉంటుందని భావించిన అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు.

ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి వివరణ ఇచ్చింది. అవి ప్రమాదంలో తగిలిన గాయాలు కాదని స్పష్టం చేసింది. ఆ ఫొటోలు ఓ సినిమాకు సంబంధించినవని వెల్లడించింది. ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొంది. తన పట్ల ఇంతమంది ప్రేమాభిమానులు ప్రదర్శించడం తనను ముగ్ధురాలిని చేస్తోందని మంచు లక్ష్మి వివరించింది.
Go Back to Shorts
Manchu Lakshmi
Pics
Instagram
Fans
Tollywood

More Telugu News