రేవంత్ పాదయాత్ర ప్రారంభం.. యాత్రలో పాల్గొన్న దిగ్విజయ్ సింగ్!
- పెరిగిన నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పాదయాత్ర
- ముడిమ్యాల నుంచి చేవెళ్ల వరకు రేవంత్ పాదయాత్ర
- బహిరంగసభలో ప్రసంగించనున్న రేవంత్, దిగ్విజయ్ సింగ్
ముడిమ్యాలలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రేవంత్ పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా పాల్గొన్నారు. పాదయాత్ర ముగిసిన తర్వాత బహిరంగసభలో రేవంత్, దిగ్విజయ్ సింగ్ ప్రసంగించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశ వ్యాప్తంగా పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టింది. నిత్యావసర ధరలు తగ్గేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.