Tollywood: వికారాబాద్ లో భీమ్లా నాయక్ షూట్.. పవన్ ను చూసేందుకు తండోపతండాలుగా తరలివచ్చిన జనం

Pawan Bheemla Nayak Shoot In Vikarabad
షార్ట్స్‌లో చూడండి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్’. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో రానా విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా తాజా షెడ్యూల్ శుక్రవారం ఉదయం మొదలైంది.

ఇందులో భాగంగా, వికారాబాద్ లోని మదన్ పల్లి  ఎల్లమ్మ ఆలయం వద్ద కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పవన్ కల్యాణ్ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. 'పవన్ కల్యాణ్' అంటూ పిలుపులతో హోరెత్తించారు.

దీంతో ఆయన కారు సన్ రూఫ్ నుంచి అభిమానులకు అభివాదం చేశారు. ఆ తర్వాత కారు డోర్ నుంచి అభిమానులను పలకరించారు. దీంతో అక్కడ సందడి నెలకొంది. కాగా సినిమాలో పవన్ కు జోడీగా నిత్యామీనన్, రానాకు జంటగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా విడుదల కానుంది.
Go Back to Shorts
Tollywood
Pawan Kalyan
Bheemla Nayak
Trivikram Srinivas
Rana Daggubati

More Telugu News