2 బస్సుల్లో వెళ్లిన ఐపీఎస్ అధికారులను జగన్ కలవలేదు: నాదెండ్ల మనోహర్
- పోలీసు ఉన్నతాధికారులందరూ వెళ్లారు
- సీఎం గారు బాగా బిజీ అని వెనక్కి పంపేస్తారా?
- ఆఫీసర్లనే కలవని సీఎం సామాన్యులనేం కలుస్తారు?
- విజయవాడలో అరగంటపాటు ట్రాఫిక్ ఆపేశారు
'శాంతి భద్రతల విధుల్లో కీలకంగా ఉండే పోలీసు ఉన్నతాధికారులందరూ సీఎం వైఎస్ జగన్ ఇంటికి వెళ్తే సీఎం గారు బాగా బిజీ అని వెనక్కి పంపేస్తారా? రెండు బస్సులు వేసుకుని విజయవాడలో అరగంటపాటు ట్రాఫిక్ ఆపేసి జనాన్ని రోడ్డు మీదే నిలిపేసి మరీ వెళ్తే ఐపీఎస్ ఆఫీసర్లనే కలవని సీఎం సామాన్యులనేం కలుస్తారు?' అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.