శేఖర్ మాస్టర్ నిర్మాతగా 'టెర్రేస్ లవ్ స్టోరీ'.. నేటి నుంచి తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్!
- 'టెర్రేస్ లవ్ స్టోరీ' పేరుతో తొలి వెబ్ సిరీస్ నిర్మించిన శేఖర్ స్టూడియోస్
- ప్రధాన పాత్రల్లో అనుపమ్ చెర్రీ, సంయూరెడ్డి
- సత్య కృష్ణ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరీస్
ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ తమ శేఖర్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ లో తొలిసారి 'టెర్రేస్ లవ్ స్టోరీ' అనే వెబ్ సిరీస్ చేశామని తెలిపారు. ఈ వెబ్ సిరీస్ ను అందరూ చూసి తమను ఆశీర్వదించాలని కోరుతున్నానని చెప్పారు. ఈ వెబ్ సిరీస్ లో అనుపమ్ చెర్రీ, సంయూరెడ్డి ప్రధాన పాత్రలను పోషించారు. సత్య కృష్ణ దర్శకత్వంలో వెబ్ సిరీస్ రూపొందింది. శేఖర్ మాస్టర్ సతీమణి శిరీష ఈ వెబ్ సిరీస్ కు నిర్మాతగా వ్యవహరించారు.