ఆ మంత్రి పెద్ద నేరస్థుడు.. లఖింపూర్ ఖేరి ఘటనపై రాహుల్ మండిపాటు
- దద్దరిల్లిన లోక్ సభ
- మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా
- కచ్చితంగా లఖింపూర్ ఘటన కుట్రేనన్న రాహుల్
అనంతరం పార్లమెంట్ ఆవరణలో రాహుల్ మీడియాతోనూ మాట్లాడారు. లఖింపూర్ ఖేరి ఘటన ఓ కుట్రంటూ నివేదిక ఇచ్చారని, కచ్చితంగా అది కుట్రేనని ఆయన అన్నారు. ఎవరి కుమారుడికి ఆ ఘటనలో హస్తం ఉందో అందరికీ తెలుసన్నారు. 'దానిపై పార్లమెంట్ లో సమగ్ర చర్చ జరగాల్సిందే. కానీ, అందుకు ప్రధాని ఒప్పుకోవడం లేదు. మంత్రిని వెనకేసుకొస్తున్నారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది అక్టోబర్ లో ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలో రైతులపైకి మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ లోని ఓ కారు ఎక్కించడంతో నలుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటన సమయంలో అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా సదరు కారులో ఉన్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత రైతులు చేసిన దాడిలో మరో నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ కేసులో ఇప్పటికే ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేశారు.