సుకుమార్ గొప్పతనం అక్కడ తెలుస్తుందట!

  • సుకుమార్ తాజా చిత్రంగా 'పుష్ప'
  • ఆసక్తిని పెంచే ఇంటర్వెల్ బ్యాంగ్
  • ఉత్కంఠను రేపే క్లైమాక్స్
  • ఈ నెల 17వ తేదీన విడుదల    
విభిన్నమైన .. విలక్షణమైన కథలను సుకుమార్ తెరకెక్కిస్తూ వస్తున్నాడు. పూర్తిస్థాయిలో 'నాన్నకు ప్రేమతో' కథను ఫారిన్ లో పరుగెత్తించిన ఆయన, గ్రామీణ నేపథ్యంలో 'రంగస్థలం' కథను నడిపించాడు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను నమోదు చేశాయి. ఆ తరువాత సినిమా అయిన 'పుష్ప' కథ అంతా కూడా అడవిచుట్టూ తిరుగుతుంది.

ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ ను సుకుమార్ ఒక రేంజ్ లో డిజైన్ చేశాడట. ప్రేక్షకులు గెస్ చేయలేని విధంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందని అంటున్నారు. అలాగే క్లైమాక్స్ కూడా ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుందని చెబుతున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ .. సెకండాఫ్ పై ఆసక్తిని పెంచితే, ఫస్టాఫ్ క్లైమాక్స్ .. సెకండాఫ్ పై ఉత్కంఠను పెంచుతుందని అంటున్నారు.

సుకుమార్ కి కథా కథనాలపై మంచి పట్టు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఇంతవరకూ చేసిన సినిమాలు ఒక ఎత్తు .. ఈ సినిమా ఒక్కటీ ఒక ఎత్తు అని చెబుతున్నారు. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి.

Allu Arjun
Rashmika Mandanna
Sukumar
Pushpa Movie

More Telugu News