Vijay Devarakonda: 'లైగర్' నుంచి రేపు రానున్న అప్డేట్

Liger movie update
షార్ట్స్‌లో చూడండి
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమా రూపొందుతోంది. చాలాకాలం క్రితమే పూర్తి కావలసిన షూటింగ్, కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. పూరి - చార్మీ నిర్మిస్తున్న ఈ సినిమాకి, కరణ్ జొహార్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు.

ఈ సినిమా నుంచి అప్పుడప్పుడు మాత్రమే అప్డేట్స్ వదులుతూ వచ్చారు. అలాగే రేపు ఉదయం 10:03 నిమిషాలకు మరో ఎనౌన్స్ మెంట్ ఉండనున్నట్టు చార్మీ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఇక ఈ సినిమా నుంచి వదిలే అప్ డేట్ ఏమిటనేది అప్పటివరకూ సస్పెన్సే.

ఈ సినిమాతో తెలుగు తెరకి అనన్య పాండే కథానాయికగా పరిచయమవుతోంది. ఈ సినిమాలో మైక్ టైసన్ అతిథి పాత్రలో కనిపించనుండగా, కీలకమైన పాత్రల్లో రమ్యకృష్ణ, మకరంద్ దేశ్ పాండే కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమాపైనే విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
Go Back to Shorts
Vijay Devarakonda
Ananya pandey
Liger Movie

More Telugu News