వినియోగదారులకు సంతోషాన్నిచ్చే నిర్ణయాన్ని తీసుకున్న జియో!

Jio gives good offer to consumers
  • ఒక్క రూపాయికే 100 ఎంబీ డేటా
  • వాలిడిటీ 20 రోజుల నుంచి 30 రోజులకు పెంపు
  • ఇతర టెలికాం సంస్థలకు షాకిచ్చిన జియో
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇటీవలే టారిఫ్ లను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. 1 జీబీ డేటాను మొన్నటి వరకు రు. 11 కి అందించిన జియో... దాన్ని రూ. 15కి పెంచింది. దీంతోపాటు అన్ని టారిఫ్ లను ఆ సంస్థ పెంచేసి వినియోగదారులకు షాకిచ్చింది. అయితే తాజాగా తన కస్టమర్లకు స్వల్ప ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. 100 ఎంబీ డేటాను 1 రూపాయికి అందిస్తున్నట్టు జియో ప్రకటించింది. అంటే 1 జీబీ డేటా 10 రూపాయలకు వస్తుందన్నమాట. జియో తీసుకున్న తాజా నిర్ణయం ఇతర టెలికాం కంపెనీలకు షాకిస్తోంది. అంతేకాదు 28 రోజుల వాలిడిటీని 30 రోజులకు పెంచుతున్నట్టు జియో ప్రకటించింది.
Go Back to Shorts
Jio
data
validity

More Telugu News