వ్యాక్సిన్ వేయించుకుంటేనే ఉద్యోగం ఉంటుంది: ఉద్యోగులకు గూగుల్ హెచ్చరిక
- ఉద్యోగులందరికీ సర్క్యులర్ జారీ చేసిన సంస్థ
- జనవరి 18లోపు టీకా వేయించుకోవాలని సూచన
- లేదంటే తొలి నెల పెయిడ్ లీవ్స్
- అయినా వేయించుకోకుంటే 6 నెలలు జీతం లేని సెలవులు
- అప్పటికీ వినకుంటే సంస్థ నుంచి బయటకు
వ్యాక్సిన్ వేయించుకోకుంటే ముందుగా జీతాల్లో కోత పెడతామని, పదే పదే చెప్పినా వినకుంటే ఉద్యోగంలోంచి తీసేస్తామని హెచ్చరించింది. టీకా తీసుకోకుంటే మొదటి 30 రోజుల పాటు పెయిడ్ అడ్మినిస్ట్రేషన్ లీవ్ కింద ఉద్యోగికి సెలవు ఇస్తామని, ఆ తర్వాత కూడా వ్యాక్సిన్ వేసుకోకుంటే ఆరు నెలల పాటు జీతం లేని వ్యక్తిగత సెలవుల్లోకి పంపిస్తామని హెచ్చరించింది. అప్పటికీ వినకుంటే సంస్థ నుంచి బయటకే పంపించేస్తామని వార్నింగ్ ఇచ్చింది.
తమ ఉద్యోగుల భద్రతకు వ్యాక్సినేషనే కీలకమని ఇప్పటికే చెప్పామని, ఉద్యోగులంతా వ్యాక్సిన్ వేసుకునేందుకు తాము చేయాల్సిందంతా చేస్తున్నామని గూగుల్ అధికార ప్రతినిధి చెప్పారు. తమ సంస్థ టీకా విధానాలపై కచ్చితంగా నిలబడతామని తేల్చి చెప్పారు.