Rana Daggubati: రానా బర్త్ డే గిఫ్టుగా 'విరాటపర్వం' నుంచి స్పెషల్ వీడియో!

  • రవన్న పాత్రలో రానా 
  • నక్సలిజం నేపథ్యంలో సాగే కథ 
  • కథానాయికగా సాయిపల్లవి 
  • సంక్రాంతికి రానున్న ట్రైలర్  
Virataparvam The Voice Of Ravanna Released

రానా కథానాయకుడిగా దర్శకుడు వేణు ఊడుగుల 'విరాటపర్వం' సినిమాను రూపొందించాడు. సురేశ్ బాబు - సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, నక్సలిజం నేపథ్యంలో నడుస్తుంది. ఈ రోజున రానా పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి 'వాయిస్ ఆఫ్ రవన్న' పేరుతో ఒక స్పెషల్ వీడియోను వదిలారు.

ఈ సినిమాలో రానా కామ్రేడ్ 'రవన్న'గా కనిపించనున్నాడు. ఆయన భావావేశమే 'ది వాయిస్ ఆఫ్ రవన్న' పేరుతో వదిలారు."మారదులే ఈ దోపిడీ దొంగల రాజ్యం మారదులే" అంటూ ఈ వీడియో మొదలవుతోంది. "చీకటి మింగిన సూర్యుడిని తెచ్చి తూరుపు కొండని వెలిగిద్దాం" అంటూ ఉద్యమం దిశగా అడుగులు వేయించడానికి ఆయన చేసిన ప్రయత్నం కనిపిస్తోంది.

ఆయన పిలుపును అందుకున్నట్టుగా సాయిపల్లవి ఒంటరిగా ఆవేశంతో బయల్దేరినట్టుగా కనిపిస్తోంది. తూటాల్లాంటి మాటలతో పాటు .. తూటాల శబ్దాల మధ్య ఈ వీడియో సాగింది. ఆవేశంతో పాటు అందమైన ప్రేమకథ కూడా ఉందనే విషయాన్ని చెప్పారు. సంక్రాంతికి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టుగా స్పష్టం చేశారు.

More Telugu News