Jagga Reddy: ఛాలెంజ్ లో గెలిచిన జగ్గారెడ్డి!

Jagga Reddy wins his challenge
  • మెదక్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 230 ఓట్లు వస్తాయన్న జగ్గారెడ్డి
  • అంతకంటే తక్కువ వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్
  • కాంగ్రెస్ కు పోలైన 238 ఓట్లు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఆరు స్థానాలకు పోలింగ్ జరగ్గా... అన్ని స్థానాల్లో గులాబీ పార్టీ గెలుపొందింది. అయితే మెదక్ జిల్లా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ... కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాను చేసిన ఛాలెంజ్ లో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థికి 230 కంటే తక్కువ ఓట్లు వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ఛాలెంజ్ చేశారు. అయితే ఈరోజు జరిగిన కౌంటింగ్ లో కాంగ్రెస్ కు 238 ఓట్లు వచ్చాయి. తాను ఛాలెంజ్ చేసిన దానికంటే కాంగ్రెస్ కు 8 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. మెదక్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డికి 762 ఓట్లు వచ్చాయి.

  • Loading...

More Telugu News