కరోనా వ్యాక్సిన్ అంటూ కళ్లలో చుక్కలు వేసి బంగారు గొలుసు చోరీ
- కర్నూలులో ఘటన
- స్టాంటన్ పురంలో నివసిస్తున్న కళావతమ్మ
- కళావతమ్మ ఇంటికి ఓ మహిళ రాక
- వ్యాక్సిన్ వేస్తామంటూ కళ్లలో చుక్కల మందు
- కళ్లు మూసుకోగానే బంగారు గొలుసుతో పరార్
మందు కారణంగా కళావతమ్మ కళ్లు మూసుకోవడంతో ఆమె మెడలోని బంగారు గొలుసును ఆ మాయలాడి తెంచుకుని పారిపోయింది. దాంతో కళావతమ్మ కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చారు. అప్పటికే ఆ మహిళ అక్కడ్నించి అదృశ్యమైంది. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.