'గమనం' సినిమా చూసేందుకు ఆటోలో కూకట్ పల్లి, మల్లికార్జున థియేటర్ కు వచ్చిన శ్రియ
- శ్రియా ప్రధాన పాత్రలో 'గమనం'
- సుజనా రావు దర్శకత్వం
- థియేటర్లలో నేడు విడుదల
- కూకట్ పల్లిలో శ్రియ సందడి
నూతన దర్శకురాలు సుజనా రావు 'గమనం' చిత్రాన్ని తెరకెక్కించింది. ఇందులో శ్రియాతో పాటు ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్, సుహాస్, రవిప్రకాశ్, శివ కందుకూరి తదితరులు నటించారు. ఈ సినిమాకు మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. కలి ప్రొడక్షన్స్, క్రియా ఫిల్మ్ కార్ప్ బ్యానర్లపై రమేశ్ కరుటూరి, వెంకీ పుష్పదపు, వీఎస్ జ్ఞానశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.