ఓ యువతి పెళ్లి జరుగుతుండగా ప్రియుడి ఎంట్రీ... నుదుటన సింధూరం దిద్ది పారిపోయిన వైనం
- ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో ఘటన
- దండలు మార్చుకునేందుకు సిద్ధమైన వధూవరులు
- అమ్మాయి ప్రియుడి రాక
- పెళ్లిమంటపంలో కలకలం
- వీడియో వైరల్
అందరూ చూస్తుండగా, నేరుగా వెళ్లి తనతో పాటు తెచ్చుకున్న సింధూరాన్ని అమ్మాయి నుదుటన దిద్దాడు. అందుకు ఆ అమ్మాయి ప్రతిఘటించింది. ఇంతలో అతడిని పట్టుకునేందుకు అక్కడివారు ప్రయత్నించారు. అయితే ఆ యువకుడు అక్కడ్నించి పారిపోయాడు. అతడిని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.