తెలంగాణలో మరో 205 కరోనా పాజిటివ్ కేసులు

  • తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • గత 24 గంటల్లో 38,085 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 79 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,871 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 38,085 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 205 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 79 కొత్త కేసులు నమోదు కాగా, హన్మకొండ జిల్లాలో 19, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 185 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,77,546 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,69,673 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,871 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించినవారి సంఖ్య 4,002కి పెరిగింది.

Telangana
Corona Virus
Media Bulletin
Today Cases

More Telugu News