కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. హెలికాప్టర్ లో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్!
- ఊటీ సమీపంలో కుప్పకూలిన హెలికాప్టర్
- చాపర్ లో రావత్ తో పాటు 14 మంది
- బయల్దేరిన కాసేపటికే కూలిన చాపర్
ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలికి మిలిటరీ అధికారులు చేరుకున్నారు. అప్పటికే 80 శాతం కాలిన గాయాలతో ఉన్న ఇద్దరిని స్థానికులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. లోయ ప్రాంతాల్లో కొందని శరీరాలు కనిపిస్తున్నాయి. వీరి శరీరాలను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హెలికాప్టర్ లో బిపిన్ రావత్ ఉన్న విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించినట్టు తెలిపింది.