ఈటల రాజేందర్ కు చెందిన జమునా హేచరీస్ సంస్థ భూములను కబ్జా చేసింది: మెదక్ జిల్లా కలెక్టర్
- 56 మంది అసైనీ భూములను కబ్జా చేశారు
- 70.33 ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేసినట్టు సర్వేలో తెలిసింది
- హేచరీస్ నుంచి కాలుష్యం వెదజల్లుతున్నట్టు గుర్తించాం
జమునా హేచరీస్ సంస్థ వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి అటవీప్రాంతంలో చెట్లను నరికి రోడ్లు వేసిందని జిల్లా కలెక్టర్ చెప్పారు. హేచరీస్ నుంచి కాలుష్యం వెదజల్లుతున్నట్టు గుర్తించామని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారిపై, వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వానికి కూడా నివేదిక అందిస్తామని తెలిపారు.