మాలిలో అల్ ఖైదా అనుబంధ సంస్థ నరమేధం... 31 మంది బలి
- బండియగర పట్టణం వద్ద ఘటన
- 50 మందితో వెళుతున్న ట్రక్కు
- కాల్పులు జరిపిన ఉగ్రవాదులు
- మంటల్లో చిక్కుకున్న ట్రక్కు
ఆ సమయంలో ట్రక్కులో 50 మంది వరకు ఉన్నారని బండియగర నగర మేయర్ హుస్సేనీ సాయే వెల్లడించారు. ఈ ఘటనలో అత్యధికులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచారని తెలిపారు. పలువురు గాయపడ్డారని, ఇద్దరి జాడ తెలియడంలేదని హుస్సేనీ వివరించారు. ఈ దారుణానికి ఇంతవరకు ఎవరూ బాధ్యత ప్రకటించనప్పటికీ, ఇది అల్ ఖైదా అనుబంధ గ్రూపు పనేనని భావిస్తున్నారు.