బ్రిటన్ లో అంతకంతకు పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.... ఓ స్కూల్లోనూ కొత్త వేరియంట్ కలకలం
- ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న ఒమిక్రాన్
- 30కి పైగా మ్యుటేషన్లతో కరోనా కొత్త వేరియంట్
- ఇంగ్లండ్ లో 29, స్కాట్లాండ్ లో 29 కేసులు
- నిబంధనలు కఠినతరం చేసిన బ్రిటన్
నరీన్ ప్రాంతంలోని రోజ్ బాంక్ ప్రైమరీ స్కూల్లో ఓ విద్యార్థికి ఒమిక్రాన్ పాజిటివ్ రావడం బ్రిటన్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ లో కొత్త నియమావళి రూపొందించారు. ఒమిక్రాన్ పాజిటివ్ వ్యక్తిని ఎవరైనా కలిస్తే వారికి 10 రోజుల ఐసోలేషన్ విధించారు. వారు కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ ఐసోలేషన్ తప్పనిసరి చేశారు.