Hyderabad: జూబ్లీహిల్స్‌లో దారుణం: బాలుడిపై యువతి అఘాయిత్యం.. ఆపై బెదిరించి రూ. 16 లక్షల దోపిడీ

woman Raped Boy and record video and Exploitation Rs 16 lakshs
  • స్కూలుకు వెళ్లి బాలుడిని లాడ్జీకి తీసుకెళ్లి అత్యాచారం
  • మాజీ ప్రియుడితో కలిసి వీడియో తీసి బెదిరింపు
  • మూడేళ్ల క్రితం జరిగినట్టుగా గుర్తింపు
  • నిందితురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు
మాజీ ప్రియుడితో కలిసి దగ్గరి బంధువైన బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా దానిని వీడియో తీసి బెదిరించి రూ. 16 లక్షల సొత్తు కాజేసిందో యువతి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల వివరాల ప్రకారం.. టోలీచౌకిలో ఉంటున్న ఓ కుటుంబం ఇటీవల జూబ్లీహిల్స్‌కు మారింది. ఈ క్రమంలో అల్మారాలో ఉండాల్సిన రూ. 20 తులాల బంగారం, నగదు కనిపించలేదు. వెతికినా ఫలితం లేకపోవడంతో 9వ తరగతి చదువుతున్నకుమారుడిని బంగారం విషయమై తల్లి ప్రశ్నించింది.

కుమారుడు చెప్పింది విని ఆమె విస్తుపోయింది. ఆ బంగారం తానే తీశానని, బెంగళూరులో ఉండే తండ్రి బంధువైన యువతికి ఇచ్చినట్టు చెప్పడంతో అందరూ షాకయ్యారు. అసలు ఏం జరిగిందని ప్రశ్నించగా బాలుడు మరిన్ని విస్తుపోయే విషయాలు బయటపెట్టాడు. తాను చదువుకుంటున్న పాఠశాల వద్దకు వచ్చిన యువతి తనను చార్మినాల్‌లోని లాడ్జ్‌కు తీసుకెళ్లిందని, అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు చెప్పాడు. మాజీ ప్రియుడితో కలిసి దీనిని ఆమె వీడియో తీసిందని, ఆ తర్వాత ఆ వీడియో చూపించి బెదిరించిందని చెప్పాడు.

భయపడి మరో గత్యంతరం లేక ఇంట్లోని 20 తులాల బంగారంతోపాటు రూ. 6 లక్షల నగదు ఆమెకు ఇచ్చేశానని వివరించాడు. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడిపై మూడుసార్లు అఘాయిత్యానికి పాల్పడిన నిందితురాలిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కాగా, ఈ ఘటన మూడేళ్ల క్రితం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు నిందితురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Jubilee Hills
Rape Case
Boy
girl
Crime News

More Telugu News