సీఎం జగన్ ను చూసి "నువ్వే మాకు దిక్కు" అంటూ వరద బాధిత మహిళలు కన్నీటి పర్యంతం

jagan visits kadapa
  • వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న
  • బోరున విల‌పిస్తూ త‌మ బాధ‌లు చెప్పుకున్న మ‌హిళ‌లు
  • అంద‌రినీ ఆదుకుంటామ‌ని ధైర్యం చెప్పిన‌ జ‌గ‌న్
వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల ప‌ర్య‌ట‌న షెడ్యూల్ లో భాగంగా ప్ర‌స్తుతం ఏపీ సీఎం జ‌గ‌న్ కడప జిల్లాలో ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌కు చూసి వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల మ‌హిళ‌లు క‌న్నీరు ఆపుకోలేక‌పోయారు. బోరున విల‌పిస్తూ త‌మ బాధ‌లు చెప్పుకున్నారు. నువ్వే మాకు దిక్కు అంటూ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు.

దాంతో సీఎం జగన్ స్పందిస్తూ అంద‌రినీ ఆదుకుంటామ‌ని ధైర్యం చెప్పారు. అక్క‌డ అధికారులు కొన‌సాగిస్తోన్న స‌హాయ‌క చ‌ర్య‌ల గురించి అడిగి తెలుసుకున్నారు.

కాగా వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో జ‌గ‌న్ నేడు, రేపు ప‌ర్య‌టించ‌నున్నారు.
Go Back to Shorts
Jagan
YSRCP
Kadapa District

More Telugu News