Akhanda Movie: అభిమానులు చేసిన రచ్చకు 'అఖండ' సినిమా షోను ఆపి, వార్నింగ్ ఇచ్చిన పోలీసులు!

Police stopped Akhanda movie show in Australia
  • ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 'అఖండ'
  • విదేశాల్లో సైతం కొనసాగుతున్న 'అఖండ' ఫీవర్
  • ఆస్ట్రేలియాలో థియేటర్లో రచ్చ చేసిన బాలయ్య అభిమానులు
బాలకృష్ణ తాజా చిత్రం 'అఖండ' ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. అఘోరా పాత్రలో బాలయ్య ప్రదర్శించిన విశ్వరూపం అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. మన దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం 'అఘోరా' ఫీవర్ కొనసాగుతోంది.

సినిమా థియేటర్లో బాలయ్య అభిమానులు చేసిన రచ్చకు... చివరకు పోలీసులు వచ్చి సినిమా షోను ఆపేశారు. ఇది ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి బాలయ్య అభిమానులు రచ్చరచ్చ చేశారు. దీంతో థియేటర్ యజమానులు షోని ఆపేసి... మైకులో వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత షో మళ్లీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత కూడా బాలయ్య అభిమానులు ఏ మాత్రం తగ్గకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారట. మళ్లీ షోను ఆపేసి వార్నింగ్ ఇచ్చి వెళ్లారట.
Akhanda Movie
Australia
Balakrishna
Police

More Telugu News