డ్రగ్స్ బానిస చేజ్ చేయడం వల్లే యాక్సిడెంట్.. కేరళ మోడల్స్ మృతిలో సంచలన విషయాలు
- హోటల్ లో అనుచితంగా ప్రవర్తించిన సైజు
- ఆ తర్వాత మోడల్స్ ను వెంబడించిన వైనం
- ఆధారాలు ఎందుకు చెరిపేశారంటూ మోడల్ సోదరుడి ప్రశ్న
ఆ కేసుకు సంబంధించి తాజాగా సంచలన విషయాలను పోలీసులు బయటపెట్టారు. డ్రగ్స్ కు బానిసైన సైజు థంకాచన్ అనే వ్యక్తి వారిని కారులో ఫాలో చేశాడని కమిషనర్ నాగరాజు తెలిపారు. మోడల్స్ పార్టీ చేసుకున్న హోటల్ లోనే సైజు కూడా ఉన్నాడని, అక్కడే ఓ రాత్రంతా తనతో గడపాలంటూ వారితో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పారు. వారు ఒప్పుకోకపోవడంతో పార్టీ అయ్యాక వారి కారును సైజు వెంబడించాడని చెప్పారు.
కాగా, ఇన్నాళ్లూ ఈ విషయాన్ని దాయడంపై అంజనా షాజన్ సోదరుడు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా పోలీసుల దర్యాప్తును నమ్ముతూనే వచ్చానని, కానీ, ఆధారాలను చెరిపేయాల్సిన అవసరం హోటల్ యజమానికి ఏమొచ్చిందని ప్రశ్నించారు. అతడిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరో మోడల్ అన్సీ ఫ్యామిలీ.. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.