'ఎన్డీయే' అంటే కొత్త అర్థం చెప్పిన కేటీఆర్
- లాక్ డౌన్ సమయంలో వలస కూలీల దుస్థితి
- వలస కూలీల మరణాలపై డేటా లేదన్న కేంద్రం
- లోక్ సభలో వెల్లడించిన కేంద్రమంత్రి
- కేంద్రంపై సర్వత్రా విమర్శలు
- 'నో డేటా అవైలబుల్' అంటూ కేటీఆర్ వ్యంగ్యం
"ఎంత మంది ఆరోగ్య సిబ్బంది చనిపోయారో ఆ డేటా కూడా వీళ్ల వద్ద ఉండదు. కరోనా కారణంగా ఎన్ని మధ్య, చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయో ఆ డేటా కూడా వీళ్ల వద్ద ఉండదు. వలస కార్మికులు ఎంతమంది చనిపోయారో ఆ డేటా కూడా వీళ్ల వద్ద ఉండదు. లాక్ డౌన్ సమయంలో ఉద్యోగాల్లేక ఎంత మంది అలమటించారో ఆ డేటా కూడా వీళ్ల వద్ద ఉండదు. రూ.20 లక్షల కోట్ల కరోనా ప్యాకేజి ఎవరికి అందిందో ఆ జాబితా కూడా వీళ్ల వద్ద ఉండదు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో ఎంతమంది రైతులు చనిపోయారో ఆ డేటా కూడా వీళ్ల వద్ద ఉండదు" అంటూ కేటీఆర్ ఎన్డీయే సర్కారును ఘాటుగా విమర్శించారు.