బాధ్యతల నుంచి తప్పుకున్న ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే.. కొత్త సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్
- పరాగ్ అగర్వాల్‌ను ఏకగ్రీవంగా ఎంచుకున్నట్టు చెప్పిన డోర్సే
- ప్రస్తుతం ట్విట్టర్ సీటీవోగా ఉన్న పరాగ్
- ట్విట్టర్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనక పరాగ్
పరాగ్ నియామకంపై డోర్సే మాట్లాడుతూ.. పరాగ్‌ను ఏకగ్రీవంగా ఎంచుకున్నట్టు చెప్పారు. కంపెనీ అవసరాలను అతడు లోతుగా అర్థం చేసుకున్నాడని, ట్విట్టర్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనక అతడు ఉన్నాడని పేర్కొన్నారు. పరాగ్‌లో ఆసక్తి, హేతుబద్ధత, సృజనాత్మకత, వినయం అన్నీ ఉన్నాయని అన్నారు. సీఈవోగా ఆయనపై తనకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. కాగా, సీఈవో పదవి నుంచి తప్పుకున్న డోర్సే 2022లో పదవీ కాలం ముగిసేంత వరకు ట్విట్టర్ బోర్డులోనే కొనసాగుతారు.