Andhra Pradesh: ఏపీలో గత 24 గంటల్లో 178 కరోనా కేసులు వెల్లడి

 AP Corona daily report
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 27,657 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 178 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 34 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 21, గుంటూరు జిల్లాలో 21 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో ఒక కేసు నమోదైంది. అదే సమయంలో 190 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,438కి పెరిగింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 20,72,624 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,56,046 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,140 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Daily Report
New Cases
Omicron

More Telugu News