నేపాలీ బాలికను దత్తత తీసుకున్న బండ్ల గణేశ్
- బండ్ల గణేశ్ మానవీయత
- పేద కుటుంబం నుంచి బాలిక దత్తత
- పాప తమ ఇంట్లో ఒకరిగా మారిపోయిందని సంతోషం
- ప్రయోజకురాలిని చేస్తానని వెల్లడి
పాప ఏడుస్తుంటే ఆమె తల్లి ఏమీ లేకపోవడంతో కేవలం పాలు పడుతున్న పరిస్థితిని తన భార్య గమనించిందని, భార్య సూచన మేరకు ఆ పాపను తమ ఇంటికి తీసుకువచ్చామని వివరించారు. ఇప్పుడా పాప తమ ఇంట్లో ఒకరిగా మారిపోయిందని, ఏకంగా తమనే బెదిరిస్తోందని సరదాగా చెప్పారు. ఆ నేపాలీ అమ్మాయిని ఉన్నత చదువులు చదివించి, ప్రయోజకురాలిని చేయాలనుకుంటున్నానని బండ్ల గణేశ్ తెలిపారు.
చాలా మంది కుక్కలు, పిల్లులను పెంచుకుంటూ ఎంతో ఖర్చు చేస్తుంటారని, తాను ఓ పాపకు జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు.