ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
- ఇటీవల కరోనా బారినపడిన తెలంగాణ స్పీకర్
- ఆసుపత్రిలో చికిత్స
- తాజా పరీక్షలో కరోనా నెగెటివ్
- కొన్నిరోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండనున్న పోచారం
ఇటీవల పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి పెళ్లి హైదరాబాదులో జరిగింది. ఈ వివాహానికి ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. ఈ పెళ్లి తర్వాతే పోచారంకు కరోనా పాజిటివ్ వచ్చింది.