టమాటా ధర ఢమాల్.. పత్తికొండ మార్కెట్లో కిలో రూ.30
- మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి పెరిగిన టమాటాల దిగుమతి
- అనంతపురంలో రూ. 55, కృష్ణాలో రూ. 60 చొప్పున విక్రయం
- టమాటాలను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం
టమాటా ధర ఆకాశాన్నంటడంతో రంగంలోకి దిగిన ఏపీ ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా టమాటాలను కొనుగోలు చేసి రైతు బజార్లకు తరలించాలని నిర్ణయించింది. అనంతపురంలో రైతుల నుంచి రూ. 50 చొప్పున కొనుగోలు చేసి మార్కెట్లో రూ. 55 చొప్పున విక్రయిస్తున్నారు. కృష్ణా జిల్లాలో కిలో టమాటా ధర రూ. 60 పలుకుతోంది.