తెలంగాణలో మరింతగా తగ్గిన కరోనా వ్యాప్తి

Corona positivity rate declines in Telangana
  • గత 24 గంటల్లో 31,514 కరోనా పరీక్షలు
  • 137 మందికి పాజిటివ్
  • జీహెచ్ఎంసీ పరిధిలో 54 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 3,538 మందికి చికిత్స
తెలంగాణలో గత కొన్నిరోజులుగా కరోనా వ్యాప్తి బాగా తగ్గింది. గడచిన 24 గంటల్లో 31,514 కరోనా పరీక్షలు నిర్వహించగా, 137 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 54 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 15 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 172 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,74,692 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,67,171 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,538 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 3,983కి పెరిగింది.
Go Back to Shorts
Telangana
Positive Cases
New Cases
Media Report

More Telugu News