తెలంగాణలో మరో 134 కరోనా కేసుల వెల్లడి
- గత 24 గంటల్లో 32,621 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 44 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 3,626 మందికి చికిత్స
అదే సమయంలో 164 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,74,452 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,66,846 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,626 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,980కి పెరిగింది.
