Andhra Pradesh: ఏపీ శాసనమండలి చైర్మన్‌గా మోషేను రాజు.. నేడు అధికారిక ప్రకటన

koyye moshen Raju is the council Chairman
  • చైర్మన్ పదవికి వైసీపీ నుంచి ఒకే ఒక నామినేషన్
  • పోటీ లేకపోవడంతో మోషేను రాజు ఎన్నిక ఏకగ్రీవం
  • డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై లేని స్పష్టత
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ పదవికి కొయ్యె మోషేను రాజు నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తప్ప మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో రాజు ఎన్నిక ఏకగ్రీవమైంది. నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు మండలిలో ప్రొటెం స్పీకర్ బాలసుబ్రహ్మణ్యం.. రాజు ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా, చైర్మన్ పదవి కోసం తాము అభ్యర్థిని నిలబెట్టడం లేదని టీడీపీ సీనియర్ నేత యనమల ఇప్పటికే స్పష్టం చేశారు. కాగా, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
Andhra Pradesh
AP Legislative Council
Koyye Moshen Raju

More Telugu News