తెలంగాణలో కొత్తగా 144 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 35,659 కరోనా పరీక్షలు నిర్వహించగా, 144 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 54 కొత్త కేసులు వెల్లడి కాగా, రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు గుర్తించారు. సంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ములుగు, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కొత్తకేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 161 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,74,181 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,66,509 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,694 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,978కి పెరిగింది.

Telangana
Corona Virus
Media Report
Daily Cases

More Telugu News