Venkaiah Naidu: ఆ పని చేసి చిరంజీవి మంచి పని చేశారు: వెంకయ్యనాయుడు

Chiranjeevi done a good job by quitting politics says Venkaiah Naidu
  • రాజకీయాలు వదిలేసి చిరంజీవి మంచి పని చేశారు
  • ప్రస్తుత రాజకీయాలు చాలా దారుణంగా తయారయ్యాయి
  • నాకు రాష్ట్రపతి కావాలనే కోరికేం లేదు
రాజకీయాలు వదిలేసి చిరంజీవి చాలా మంచి పని చేశారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రస్తుతం రాజకీయాలు చాలా దారుణంగా తయారయ్యాయని, నేతలు మాట్లాడుతున్న భాష అసలు బాగుండటం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజకీయాలు తనకు నచ్చడం లేదని అన్నారు. ఉపరాష్ట్రపతి కావడం వల్ల ప్రజలకు దూరంగా ఉండాల్సి వస్తోందని, ఇది తనకు కొంచెం ఇబ్బందిగా ఉందని... అయితే, ఈ పదవి వల్ల కొంచెం తొందరగా పడుకుంటున్నానని చమత్కరించారు.

 తాను రాష్ట్రపతి కావాలనేది చిరంజీవి కోరిక అని, తన శ్రేయోభిలాషులు చాలా మంది ఇదే కోరుకుంటున్నారని... కానీ రాష్ట్రపతి కావాలనే కోరిక తనకేం లేదని అన్నారు. కరోనా ఇంకా పోలేదని, ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు. మోదీ కోసమో, కేసీఆర్ కోసమో కాకుండా... మన కోసం మనం రూల్స్ పాటించాలని చెప్పారు. హైదరాబాదులో ఈరోజు యోధ డయోగ్నస్టిక్ సెంటర్ ను వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Venkaiah Naidu
Chiranjeevi
Tollywood

More Telugu News