వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని అయ్యప్ప సాక్షిగా కోరుకుంటున్నా: చిరంజీవి
- యోధ లైఫ్ లైన్ డయోగ్నస్టిక్స్ సెంటర్ ను ప్రారంభించిన వెంకయ్యనాయుడు
- కార్యక్రమానికి హాజరైన చిరంజీవి, తలసాని
- వెంకయ్యనాయుడు సమాజానికి చేస్తున్న సేవలు అనిర్వచనీయమైనవన్న చిరంజీవి
హైదరాబాదులోని లాల్ బంగ్లాలో యోధ లైఫ్ లైన్ డయోగ్నస్టిక్స్ సెంటర్ ను ఈరోజు వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నో ఏళ్లుగా తన సొంత వనరులతో ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నానని చెప్పారు. సినీ పరిశ్రమలో పని చేస్తున్న పేద కళాకారులకు లైఫ్ లైన్ డయోగ్నస్టిక్స్ సెంటర్ లో పరీక్షలు చేయించుకునే వెసులుబాటును కల్పించాలని కోరారు.