Vijayasai Reddy: టీడీపీ పతనం ప్రారంభమయింది: విజయసాయిరెడ్డి

TDP downfall started says Vijayasai Reddy
  • ఇకపై ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను చంద్రబాబు కోల్పోయారు
  • చంద్రబాబుకు ఏపీకి వచ్చే అర్హత కూడా లేదు
  • మరో 20 ఏళ్లు సుపరిపాలన అందిస్తాం
మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు పట్టం కట్టారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయానికి చిహ్నమని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ పతనం ప్రారంభమయిందని అన్నారు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానానికి ముగింపు పడిందని చెప్పారు.

ఇకపై ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను చంద్రబాబు కోల్పోయారని అన్నారు. సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయిన చంద్రబాబుకు దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమాలు అని మాట్లాడే అర్హత లేదని చెప్పారు. చంద్రబాబు హైదరాబాదులోనే ఉండిపోవాలని... ఆయనకు ఏపీకి వచ్చే అర్హత కూడా లేదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ సుపరిపాలనను ప్రజలు అర్థం చేసుకున్నారని, వైసీపీని ఆశీర్వదించారని చెప్పారు. మరో 20 ఏళ్ల పాటు సుపరిపాలనను అందిస్తామని అన్నారు.
Vijayasai Reddy
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News