YS Vivekananda Reddy: వైయస్ వివేకా హత్య కేసు.. ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి ముఖ్య అనుచరుడు అరెస్ట్!

YS Avinash Reddy aide Shiva Shankar Reddy arrested in YS Vivekananda Reddy murder case
  • శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు
  • హైదరాబాద్ ఆసుపత్రిలో అదుపులోకి తీసుకున్న వైనం
  • అరెస్ట్ చేసినట్టు కుటుంబసభ్యులకు తెలిపిన అధికారులు
మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కీలక దశకు చేరుకుంది. వివేకా డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంతో పలువురి పేర్లు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. మరోవైపు ఈరోజు మరో కీలక ఘటన చోటుచేసుకుంది. కేసులో అనుమానితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివశంకర్ రెడ్డిని అక్కడే అదుపులోకి తీసుకొని నగరంలోని సీబీఐ కార్యాలయానికి తీసుకెళ్లారు. కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి శివశంకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు కావడం గమనార్హం. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ కార్యాలయంలో విచారించిన అనంతరం ఆయనను అరెస్ట్ చేసినట్టు కుటుంబసభ్యులకు అధికారులు సమాచారం అందించారు.
YS Vivekananda Reddy
YS Avinash Reddy
Murder
Arrest
Shiva Shankar Reddy

More Telugu News