బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి ఐసీసీ ప్రమోషన్
- మెన్స్ క్రికెట్ కమిటీకి చైర్మన్ గా నియామకం
- ప్రకటించిన ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్ క్లే
- కుంబ్లే స్థానంలో గంగూలీ
- తొమ్మిదేళ్లు సేవలందించిన కుంబ్లే
మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్ గా గంగూలీకి స్వాగతమంటూ ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్ క్లే అన్నారు. క్రికెట్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన అనుభవం ఐసీసీకి ఎంతో ఉపయుక్తమవుతుందని చెప్పారు. గత 9 ఏళ్లుగా ఎనలేని సేవలందించిన కుంబ్లేకి కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నేళ్లలో పకడ్బందీగా డీఆర్ఎస్ అమలు, అనుమానిత బౌలింగ్ యాక్షన్ ను గుర్తించేందుకు అధునాతన ప్రక్రియలకు అనిల్ కుంబ్లే శ్రీకారం చుట్టారని కొనియాడారు.
అంతేగాకుండా మహిళా క్రికెట్ లోనూ ఫస్ట్ క్లాస్ స్టేటస్, లిస్ట్ ఏ క్లాసిఫికేషన్ కు ఐసీసీ ఆమోదం తెలిపింది. మహిళా క్రికెట్ కు సంబంధించి కూడా ఐసీసీ విమెన్స్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. ఆ కమిటీకి వెస్టిండీస్ క్రికెట్ సీఈవో జానీ గ్రేవ్ ను చైర్మన్ గా నియమించింది.